telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు: అరుణోదయ విమలక్క

vimalakka arunodaya

ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ నేపథ్యంలో కార్మికులకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ‘అరుణోదయ’ విమలక్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మె విరమించాక చర్చలేముంటాయి? మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. ముందుగా, చర్చలు జరిపితే, ఆ తర్వాత సమ్మె విరమిస్తారని చెప్పారు. సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు అని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts