telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటివద్దే అశ్వత్థామరెడ్డి దీక్ష.. చర్చలకు పిలిచే వరకు కొనసాగింపు!

ashwathama reddy

టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను దృష్టిలో పెట్టుకుని ఉదయం పోలీసులు అశ్వత్థామరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. అశ్వత్థామరెడ్డి వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి ఇందిరాపార్క్ లో దీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ అనుమతి లేదంటూ పోలీసులు ప్రాంగణం వద్దకు రానివ్వక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందు ప్రకటించిన  విధంగానే ఈరోజు ఉదయం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్మిళా నగర్ లోని తన స్వగృహంలోనే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతంగా అరెస్టు చేసినా దీక్ష ఆగదని తెలిపారు. అర్ధ రాత్రివేళ తన ఇంటిని చుట్టుముట్టి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ఊర్మిళా నగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు.

Related posts