telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మె విచారణపై హైకోర్టు కీలక సూచనలు!

high court on new building in telangana

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే కార్మిక సంఘాలు వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం ఒక్క డిమాండ్ పైనే పట్టబట్టడం సరికాదని హైకోర్టు పేర్కొన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని యూనియన్ తరపు న్యాయావాది దేశాయి ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలిపారు.

21 డిమాండ్లపైనే చర్చిస్తామంటూ ఇతర డిమాండ్లను పట్టించుకోలేదని ప్రకాశ్ రెడ్డి వివరించారు. కార్పోరేషన్ పై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చలు సాగాలని హైకోర్టు పేర్కొంది. మొదట యూనియన్ పేర్కొన్న 21 డిమాండ్లపై చర్చలు సాగితే.. కార్మికుల్లో ఆత్మస్ఘైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది. విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొంది.

Related posts