telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత: తమ్మినేని

thammineni cpi

ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ఆత్మాహుతి యత్నం చేయగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కారుపై విపక్షాలతోపాటు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమ న్యాయమైన కోర్కెలు సాధించుకునేందుకు సమ్మె చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.

ఓ మీడియా చానెల్‌ ప్రతినిధితో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని, కానీ కార్మికులకు అండగా ప్రజలు, ప్రతిపక్షాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి హక్కులు సాధించుకుందామని తెలిపారు.

Related posts