telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

బైక్ పై వచ్చి రాళ్లదాడి..ఆర్టీసీ బస్సు ధ్వంసం

rtc bus broken

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని అన్ని యూనియన్లు స్ట్రైక్ చేస్తున్నాయి. మరోవైపు, ప్రజల సౌకర్యార్థం కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఈ బస్పులను పోలీసుల బందోబస్తుతో నడుపుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్ కు వస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు… బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ… మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు.

Related posts