telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

టీఎస్‌ ఐసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

exam hall

తెలంగాణ ఐసెట్‌-2020 పరీక్షల షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మార్చి 30. రూ. 500 ఫైన్‌తో మే 14 వరకు, రూ. 5 వేల ఫైన్‌తో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 20, 21 తేదీల్లో ఐసెట్‌-2020 పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ వెల్లడించారు. మే 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఈ సారి ఐసెట్‌ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు.

తెలంగాణలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో కర్నూల్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కన్వీనర్‌ తెలిపారు.

Related posts