telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” రిలీజ్ కు హైకోర్టు బ్రేక్

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తనను కించపరిచేలా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్ ఉందని, ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇది వరకే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం విడుదలకు టీఎస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హైకోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్ బోర్డుకు హైకోర్టు సూచించింది. రెండు కులాల మధ్య చిచ్చు రాజేసేలా ఉన్న టైటిల్ ను మార్చాలని హైకోర్టు సెన్సార్ బోర్డుకు నిర్దేశించింది. అయితే సినిమా టైటిల్ ను ఇప్పటికే మార్చామని, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును కోరారు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా టైటిల్ ను “అమ్మ రాజ్యంలో కడప రెడ్లు”గా మార్చే అవకాశమున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts