telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… ఎంసెట్, ఈసెట్ కొత్త తేదీలు విడుదల..

తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల్లో ఎంసెట్​, ఈసెట్​, పీజీఈసెట్​.. ఉండగా వాటి షెడ్యూల్​ను ఖరారు చేసింది.

ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక ఈసెట్​ ను ఆగస్టు 1న, పీజీఈసెట్​ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

వాస్తవానికి ఈ పరీక్ష ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. ఎడతెరపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా పరీక్షలను వాయిదా వేసింది ఉన్నత విద్యామండలి. ఎంసెట్ ఇంజనీరింగ్ కు సంబంధించిన పరీక్షలను మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది.

తాజాగా వాయిదా పడిన అగ్రికల్చర్ ఎంసెట్ కు సంబంధించిన తేదీలను తాజాగా విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.

వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు….

1. ఈనెల 30, 31న టీఎస్‌ ఎంసెట్‌ (అగ్రికల్చర్‌&మెడికల్‌)

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు

2. టీఎస్‌ ఈసెట్‌ ఆగస్టు 1న

ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు

3. టీఎస్‌ పీజీఈసెట్‌- ఆగస్టు 2 నుంచి 5 వరకు

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు

Related posts