telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

16న శబరిమలకు వెళ్తున్నా .. తృప్తి దేశాయ్‌ .. స్వాగతం అంటున్న సీఎం..

trupti desai to sabarimala on 16th scheduled

సుప్రీంకోర్టు శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్‌ స్పందించారు. ఈ నెల 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఆలయంలోకి ఎవరైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ.. శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని అన్నారు.

శబరిమలలో ఎలాంటి వివక్ష లేదని కొందరు అంటున్నారు. అదంతా తప్పు. ఒక ప్రత్యేక ఒక వయస్సు కల్గిన మహిళల ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తున్నారు. నవంబర్‌ 16న నేను శబరిమల వెళ్తున్నానని తెలిపారు. గతేడాది నవంబర్‌లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయ్‌ కూడా శబరిమల వెళ్లేందుకు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వివక్ష లేదనే స్పష్టం చేస్తుంది. ఇంతకీ శబరిమలలో వివక్ష ఉందా లేక వయోనియమం ఉందా.. అంటే రెండోదే ఉంది. మహిళలలో పదేళ్ల లోపు వారు, అలాగే వయసు 50 దాటిన వారు వెళ్తూనే ఉన్నారు. కానీ దీనిని ఛాందసవాదులు రాజకీయ అనిచ్చితి కోసం దుష్టశక్తులతో కలిసి చేస్తున్న దుర్మార్గపు చర్యగా కూడా అక్కడి భక్తులు విమర్శిస్తున్నారు.

Related posts