telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరో సారి శాంతి పాటతో ట్రంప్..మాకొద్దం

trump with peace agenda again Palestine

టున్న పాలస్తీనా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్దరణ కోసం రూపొందించిన ప్రణాళికను వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో కలిసి వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ ప్రణాళికను విడుదల చేశారు. అయితే ఈ ప్రణాళికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా నాయకత్వం స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రణాళికను వ్యతిరేకించాలని పాలస్తీనా నాయకత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రణాళికకు సంబంధించి అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రతిపాదనలను అధ్యక్షుడు మహ్మూద్‌ అబ్బాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారని పాలస్తీనా నేతలు చెబుతున్నారు. అమెరికా అనుసరిస్తున్న ఇజ్రాయిల్‌ అనుకూల వైఖరి కారణంగానే తాము ఈ ప్రణాళికను వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా ప్రధాని మహ్మద్‌ షతయ్యా మీడియాకు చెప్పారు. రెండు దేశాల పరిష్కారాన్ని అధికారికంగా గుర్తించేంత వరకూ అమెరికా నేతలతో ఎటువంటి చర్చలూ వుండబోవని షతయ్యా స్పష్టం చేశారు. 2017 నుండి కసరత్తు కొనసాగుతున్న ఈ శాంతి ప్రణాళిక వివరాలు ఇప్పటి వరకూ బహిర్గతం కాకపోవటం గమనార్హం.

Related posts