telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నోరు జారిన ట్రంప్.. ట్రోల్ చేసేస్తున్న ప్రత్యర్థులు.. కిడ్నీ అక్కడే..

trump new policies on h1b visa

రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొర్లడం సహజమే. కానీ తప్పులు దొర్లేది చిన్నా చితకా నాయకుల నోటి వెంట అయితే ఫరవాలేదు.. అగ్రరాజ్య అధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి నుంచి తప్పులు దొర్లితే.. ప్రపంచమంతా హాస్యాస్పదంగా చూస్తుంది. అలాంటిదే సంఘటన ఒకటి బుధవారం ట్రంప్‌ ప్రసంగంలో చోటుచేసుకుంది. మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసే సమావేశంలో ట్రంప్‌ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ట్రంప్‌ కిడ్నీ సమస్యలపై అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మీరు కిడ్నీ సమస్యలపై బాగా పని చేశారు. ‘కిడ్నీకి గుండెలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని’ అన్నారు. కిడ్నీ గుండెలో ఉండటం ఏంటని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ట్రంప్‌ మాట్లాడిన ఈ వీడియోను కొందరు ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈవిధంగా కిడ్నీపై ట్రంప్‌ చేసిన హాస్యాస్పద వ్యాఖ్యల్ని నెట్టింట్లో పలువురు చమత్కారంగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts