telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాషింగ్టన్ : … రాక్షసుడినే మేము హతమార్చింది.. ట్రంప్ సమాధానం..

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖాసిం సోలేమని ఓ నరరూప రాక్షసుడని అభివర్ణించారు. అమెరికాపై మహోగ్ర దాడికి కుట్ర పన్నాడనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఆయనపై దాడి చేయాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పారు. ఒక్క ఖాసింను చంపడం వల్ల వేలాదిమంది అమాయకుల ప్రాణాలను తాము రక్షించగలిగామని అన్నారు. గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిట్సోటకిస్ తో తన అధికారిక నివాసంలో అత్యున్నత సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దళం ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఖాసిం సోలేమని మరణించిన విషయం తెలిసిందే. ఖాసింను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూరకంగానే అమెరికా ఈ వైమానిక దాడులను నిర్వహించింది.

గ్రీస్ ప్రధానమంత్రితో సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖాసింను ఓ నరరూప రాక్షసుడిగా సంబోధించారు. ఖాసిం ఇంకొన్ని రోజుల పాటు జీవించి ఉండి ఉంటే.. దారుణ పరిస్థితులు ఎదురై ఉండేవని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారీ ఎత్తున మారణ హోమాన్ని సృష్టించడానికి ఆయన కుట్ర పన్నాడని, తమ గూఢచర్య ఏజెన్సీల ద్వారా దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని అన్నారు. తమ రక్షణ మంత్రిత్వ శాఖకు అందిన సమాచారాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించామని, అవన్నీ నిజమని ధృవీకరించుకున్న తరువాతే.. ఖాసింను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను చేయాల్సి వచ్చిందని అన్నారు. తమ చర్యల వల్ల వందలాది మంది ప్రాణాలను తాము కాపాడగలిగామని ట్రంప్ వివరించారు. ఖాసింను చంపడం వల్ల తమపై ఎవరూ వేలెత్తి చూపలేరని, తమ చర్యలను ఏ ఒక్కరు కూడా తప్పు పట్టబోరని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

Related posts