telugu navyamedia
రాజకీయ వార్తలు

వైట్ హౌస్ వద్ద నిరసనలు.. బంకర్ లోకి జారుకున్న ట్రంప్!

trump usa

అమెరికాలో నల్లజాతికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేశారని ఆరోపిస్తూ వైట్ హౌస్ వద్ద నిరసనకు దిగారు. లక్షలాది మంది ప్రజలు, అతని మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌస్ కింద నిర్మించిన బంకర్ లోకి వెళ్లిపోయారని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.

శ్వేత సౌధం అధికారులు ఆయన్ను బంకర్ లోకి తరలించారని, దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని, సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు అధికారులు నిరసనకారులను నిలువరించిన తరువాత ట్రంప్ మరలా బయటకు వచ్చారని పత్రిక పేర్కొంది. ట్రంప్ తో పాటు ఆయన కుటుంబీకులైన మెలానియా, బారన్ తదితరులను కూడా బంకర్ లోకి తరలించారా? అన్న విషయంపై పత్రికలో వెల్లడించలేదు.

Related posts