telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్ ని తిట్టిపోస్తున్నారు.. ఆ మాత్రం తెలీదా ?

trump india tour

సైనిక ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌… తన కోసం బయట ఎదురుచూస్తున్న మద్దతుదారులకు కనిపించేందుకు కొద్ది సేపు బయటకు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో కారులో చక్కర్లు కొట్టారు. అమెరికా జాతీయ జెండాను పట్టుకొని మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. తాను బాగానే ఉన్నానని సంజ్ఞల ద్వారా తెలియజేశారాయన.

 

కాగా, ఆస్పత్రి ఆవరణలోకి రాబోతున్నట్టు ముందుగానే ట్విటర్‌ ద్వారా సంకేతం ఇచ్చారు ట్రంప్‌. త్వరలోనే తన కోసం వేచి చూస్తున్న అభిమానులను ఆశ్చర్యంలో ముంచబోతున్నానని తెలిపారు. ‌ ట్రంప్ బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా కరోనా నిబంధనలకు విరుద్ధమని, ట్రంప్‌ ప్రయాణించిన కారు ద్వారా వేరే వాళ్ళకి వైరస్‌ సోకే అవకాశం చాలా ఎక్కువని అంటున్నారు. కారులో ఆయనతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని. తెలిసి కూడా ఇలా తప్పు చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు.

Related posts