telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇరాన్ పై అమెరికా యుద్ధం : ..అధికారం కోసమే ట్రంప్ వెనకడుగు…

trump new policies on h1b visa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కోట్ల రూపాయల విలువైన డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసిందంటూ సమరభేరి మోగించి చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే ఇరాన్ లక్ష్యంగా గాల్లోకి లేచిన యుద్ధ విమానాలు ట్రంప్ తాజా ఆదేశాలతో వెనుదిరగడం ఇటీవల కాలంలో ఎన్నడూచూడని పరిణామం. ట్రంప్ అనూహ్యరీతిలో వెనుకడుగు వేయడానికి కారణం ఓ న్యూస్ చానల్ లో వచ్చిన కార్యక్రమం అంటే విస్మయం కలిగించకమానదు. ఇరాన్ పై యుద్ధానికి సిద్ధం కావాలంటూ రక్షణ దళాలకు ఆదేశాలిచ్చిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్ లో కూర్చుని ఫ్యాక్స్ న్యూస్ చానల్లో వచ్చే ఓ కార్యక్రమాన్ని వీక్షించారు. టకర్ కార్ల్ సన్ అనే న్యూస్ ప్రజంటర్ తన గురించి చెప్పిన విషయాలు ట్రంప్ ను ఆలోచింపచేశాయని తెలుస్తోంది. అధ్యక్షుడి కార్యవర్గంలోని వ్యక్తులు ట్రంప్ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించడంలేదని కార్ల్ సన్ పేర్కొన్నారు.

ఇప్పటికిప్పుడు ఇరాన్ తో యుద్ధానికి దిగితే అది ట్రంప్ కు 2020 ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉందని, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టడం గురించి ట్రంప్ ఆశలు వదులుకోవాల్సిందేనని కార్ల్ సన్ విశ్లేషించారు. ఇతర దేశాలతో యుద్ధాలు అమెరికాకు కలిసిరాలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా, యుద్ధకాంక్షలేని అధ్యక్షుడిగా ట్రంప్ కు ఉన్న ఇమేజ్ ఇప్పుడు మసకబారుతుందని కార్ల్ సన్ చెప్పడంని కూడా ట్రంప్ ను ఆలోచనలో పడేసి ఉంటుందని అమెరికా మీడియా పేర్కొంది. మొత్తమ్మీద ఈ కార్యక్రమం చూసిన వెంటనే ట్రంప్ యుద్ధం వద్దంటూ ఆదేశాలు ఇవ్వడంతో కార్ల్ సన్ విశ్లేషణ ట్రంప్ పై బాగా ప్రభావం చూపి ఉంటుందని అమెరికా మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related posts