telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గ్రేటా థన్ బర్గ్ ను చూసి .. ఉడుక్కుంటున్న ట్రంప్.. అందుకే జారి..

16 years girl on times magazine on

డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారీ తన పెద్దరికాన్ని ప్రశ్నించుకున్నాడు. ఆయన నోరు ఊరికే ఉండదు అన్నదన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటేగాని ఆయనకు నిద్ర పట్టదు. ఆటలాడుకునే చిన్న పిల్లవాడినైనా గిల్లి ఏడిపించే రకం ట్రంప్. అలాగే బుధవారం ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్… పర్శన్ ఆప్ ది ఇయర్ 2019గా స్వీడన్ కు చెందిన 16ఏళ్ల గ్రేటా థన్ బర్గ్ అనే బాలిక ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది.

ఈ వార్త కస్తా ట్రంప్ చెవిన పడింది. ఇక వెంటనే ఓ ట్వీట్ చేసేశారు. ఆ ట్వీట్ లో…చాలా హాస్యాస్పదం. గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. ఆపై ఫ్రెండ్ తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ గ్రెటా, చిల్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు(నీతులు చెప్పేవాళ్ళే అవి పాటిస్తే బాగుండేది). వాతావరణ మార్పులకు ప్రప్రంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ప్రశ్నించి ప్రపంచం మన్ననలు పొందిన గ్రేటా థన్ బర్గ్..వాతావరణ మార్పుకు వ్యతిరకంగా క్యాంపెయిన్ చేసేందుకు ప్రతి శుక్రవారం స్కూల్ కి వెళ్లకుండా స్వీడన్ పార్లమెంట్ బయట ఓ ప్లకార్డ్ తో కూర్చునేదన్న విషయం తెలిసిందే.

Related posts