telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మరోసారి .. ట్రంప్‌-కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భేటీ .. అగ్రదేశం వెనక్కి తగ్గుతుందా..

kim and trump meet failed

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి భేటీ కి సిద్ధం అయ్యారు. ఈ మేరకు ఉ.కొరియా విదేశాంగ మంత్రి చోసన్‌ హుయీ ఒక ప్రకటన లో తెలిపారు. ఈనెల4న వీరు భేటీ అవుతున్నారు, అయితే ఎక్కడ అనేదానిపై స్పష్టత లేదు. కిమ్‌, ట్రంప్‌ భేటీని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ స్వాగతిస్తున్నట్టు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. కాగా, ఐరాస ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలను నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తున్నది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఉత్తరకొరియాపై ఆంక్షలను కొనసాగించారు. అమెరికా ఆంక్షలను బేఖాతర్‌ చేస్తూ కిమ్‌ అణ్వస్త్ర ప్రయోగాలు చేపట్టారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

Related posts