telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల వేతనాల చెల్లింపుపై హైకోర్టులో వాదనలు

high court on new building in telangana

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. దీంతో కార్మికులు హైకోర్టులో కోర్టులో పిటిషన్‌​ దాఖలు చేశారు. కార్మికుల జీతాల చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం జరిగిన విచారణలో.. ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద కేవలం రూ. 7.5 కోట్లే ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరమవుతాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే, ‘సమ్మె కొనసాగుతున్నా.. 50 శాతం బస్సులను తిప్పుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. మరి వచ్చిన ఆదాయమంతా ఎక్కిడికి పోయింది’అని కార్మికుల తరపు పటిషనర్‌ వాదించారు. తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్‌ నెల వేతనాలను ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్‌లో విచారణ అనంతరం వేతనాల చెల్లింపు పిటిషన్‌పై విచారణ చేపడతామమని వెల్లడించింది. తదుపరి విచారణ 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Related posts