telugu navyamedia
news political Telangana

తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుతో.. ఏపీలో జనసేన సంబరాలు

Janasena releases final list

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి మొదలైన నుంచి కారు జోరు చూపించడంతో మంగళవారం ఉదయం నుంచే కార్యకర్తలు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల్లో తేలిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పండుగ చేసుకుంటున్నారు.

టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు బాణసంచా కాల్చి సంబరాల్లో మునిగిపోయాయి. అమరావతి ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ గెలుపొందడంతో సంబరాల్లో పాల్గొన్నారు. అనైతిక రాజకీయాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

15 ఏళ్ల క్రితం పదివేలతో దుబాయ్ కి… ఇప్పుడు…!!

vimala p

జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు : మోహన్ బాబు

ashok

ప్రధాని కూడా .. ‘నా సామజిక వర్గం.. ‘.. అంటున్న వైనం.. ! ఇంకెక్కడి మార్పు.. !!

vimala p