• Home
  • వార్తలు
  • రంగారెడ్డి జిల్లాలో గ్రామస్థుల ఆగ్రహం..టీఆర్ఎస్ ప్రచార రథం ధ్వంసం
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

రంగారెడ్డి జిల్లాలో గ్రామస్థుల ఆగ్రహం..టీఆర్ఎస్ ప్రచార రథం ధ్వంసం

TRS Vechicle Broken in Shadnagar

ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ గంటవిల్లి దేవుని బండ తండా వాసులు ప్రచార రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. దానికి ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేతలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ అరుణ సొంత తండా అయినా నీటికి కటకట తప్పడం లేదని మండిపడ్డారు. మంచినీళ్ల కోసం మహిళలు పడుతున్న కష్టాలు చూడలేక గ్రామంలోని గిరిజన యువత… టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related posts

దాణా కేసులోనూ లాలూకు శిక్ష…

admin

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు : మోడీ

admin

ఢిల్లీలో పోటాపోటీ వ్యూహప్రతివ్యూహాలు 

admin

Leave a Comment