telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

TRS Release Lok Sabha Candidates List

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున లోక్‌ సభ బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను గురువారం అధికారికంగా వెల్లడించారు. మొత్తం పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులందరికి కేసీఆర్‌ బీఫామ్‌లు అందజేశారు. అయితే పలు చోట్ల సిట్టింగ్‌లను పక్కకుబెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి, మల్కాజ్‌గిరి ఎంపీలు గెలుపొందిన బాల్క సుమన్, సీహెచ్ మల్లారెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున వారి స్థానాల్లో వేరేవారికి అవకాశం కల్పించారు.

సిట్టింగ్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, సీతారాం నాయక్‌లకు టికెట్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ నిరాకరించారు. పెద్దపల్లి ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్‌కు నిరాశే మిగిలింది. ఈ స్థానాన్ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలై, టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న నేతకాని వెంకటేశ్‌కు కేటాయించారు.

టీఆర్‌ఎస్‌ లోక్‌ సభ అభ్యర్థులు:
కరీంనగర్‌- బోయినపల్లి వినోద్‌ కుమార్‌
పెద్దపల్లి- బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని
ఆదిలాబాద్‌- గోడెం నగేశ్‌
నిజామాబాద్‌- కల్వకుంట్ల కవిత
జహీరాబాద్‌- బీబీ పాటిల్‌
మెదక్‌- కొత్త ప్రభాకర్‌ రెడ్డి
వరంగల్‌- పసునురి దయాకర్‌
మహబూబాబాద్‌- మాలోతు కవిత
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
భువనగిరి- బూర నర్సయ్య గౌడ్‌
నల్గొండ- వేమిరెడ్డి నర్సింహరెడ్డి
నాగర్ కర్నూల్- పోతుగంటి రాములు
మహబూబ్‌ నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి
చేవెళ్ల- గడ్డం రంజిత్‌ రెడ్డి
సికింద్రాబాద్‌- తలసాని సాయి కిరణ్‌
మల్కాజ్‌గిరి- మర్రి రాజశేఖర్‌ రెడ్డి
హైదరాబాద్‌- పుస్తె శ్రీకాంత్‌

 

Related posts