telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మద్యనిషేదంపై పవన్ వ్యాఖ్యలపై .. తెరాస ఆగ్రహం.. వివరణ ఇచ్చేశారు..

trs protest at pavan house in hyderabad

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీలో మద్య నిషేధంపై వ్యాఖ్యానిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్య నిషేధం ఎంత కష్టమో వివరించే క్రమంలో పవన్ తెలంగాణ ఉద్యమం నాటి కొన్ని అంశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. దీనిపై టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు ఉద్యమ అమరవీరులను కించపరిచేవిగా ఉన్నాయని మండిపడ్డారు.

పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసం ఎదుట ధర్నాకు దిగిన గులాబీ దండు కార్యకర్తలు డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు చేయడం పట్ల చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ మద్యనిషేధం ఎంత కష్టమో చెప్పేందుకని సాయుధ పోరాటం నాటి కొన్ని విషయాలను ఉటంకించానని, పోరాటాన్ని అణచివేసేందుకు మద్య నిషేధాన్ని వాడుకున్నా సాధ్యంకాని విషయం గురించి కొన్ని రచనల్లో ఉందని ట్వీట్ చేశారు.

Related posts