telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పసుపు బోర్డు సంగతి చెప్పండి అరవింద్ గారు ??

బీజేపీ ఎంపీ అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కొందరు రెచ్చగొట్టి జిల్లాలో రైతులతో ఆందోళనలు చేయిస్తున్నారని..గత సంవత్సరం మొక్కజొన్న పెద్ద ఎత్తున కొనడంతో ప్రభుత్వనికి చాలా నష్టం జరిగిందన్నారు. మక్క పంటలు వెయ్యవద్దని ముఖ్యమంత్రి కోరినా కొందరు రైతులు వేశారని..తెరాస పార్టీ రైతు పక్ష పార్టీ ప్రభుత్వం, రైతు బంధు ప్రభుత్వమని తెలిపారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో పంటలు పెరిగాయి….దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. గత సంవత్సరం మక్కల కొనుగోలుతో ప్రభుత్వానికి 840 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనేది కేవలం వడ్లు మాత్రమే…మక్కలను కొనుగోలు చేయదు…మార్కుఫెడ్ కూడా తీవ్ర నష్టాల్లో ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను విదేశాల నుండి ఎగుమతి చేస్తే మీరు ఎందుకు విమర్శించ లేదు ఎంపీ అరవింద్ ?? అని ప్రశ్నించారు. మాది రైతు ప్రభుత్వం..ఇవాళ రైతుల కోసం 7000 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా ఇస్తున్నామని తెలిపారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపీ పసుపు బోర్డు సంగతి చెప్పండి అరవింద్ గారు ?? అని నిలదీశారు.

Related posts