telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ వార్తలు అవాస్తవం అని తేల్చిన దివంగత ఎమ్మెల్యే కుమారులు…

తెలంగాణ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిన్న అనారోగ్యంతో కాలం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన  అనంతరం ఆయన మాట్లాడినట్టుగా కొన్ని ఆడియో టేపులను గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అందులో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టు ఉండడంతో ఈ అంశం మీద నోముల నర్సింహయ్య కుమారుడు స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. మేము మా నాన్న గారు చనిపోయే వరకు ఆయనతోనే ఉన్నాము, మా నాన్నగారికి కరోనా వచ్చి చనిపోయారని వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అన్నారు. అదే విధంగా మరి కొన్ని తప్పుడు విషయాలు ప్రస్తావిస్తూ కొంతమంది వ్యక్తులు ఆడియో టేపులను విడుదల చేశారు అని, వాటిపై స్థానిక ఏవి రంగనాథ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఆయన గురించి తెలిసిన ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకుండా రేపు జరగబోయే ఆయన అంత్యక్రియలు నాగార్జున సాగర్ ప్రజలు లో పాల్గొనాలని కోరారు.  ఇక ఇదే అంశంలో ఈ వాయిస్ ని మిమిక్రీ చేసిన ఆర్టిస్ట్ కూడా మరో వాయిస్ విడుదల చేశారు. నరసింహయ్య మరణించాక ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో మాట్లాడి చూపాలని కొందరు మిత్రుల కోసం అలా మాట్లాడానని అయితే వాటిని ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొన్నారు.

Related posts