telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేది దానం కాదు…

niranjan

ప్రస్తుతం తెలంగాణలో నాదరూ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టారు. అయితే తాజాగా భద్రాద్రి లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రం బాధ్యతలు వదిలేసి ఆరోపణలు చేస్తుందని, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేది దానం కాదు అది రాష్ట్రానికి రావాల్సిన వాటా అని గుర్తుంచుకోవాలి అని తెలిపారు. కేంద్రానికి రాష్ట్రం నుండి పోయింది రూ.2.72 లక్షల కోట్లు అయితే, తిరిగి ఇచ్చింది రూ.లక్షా 40 వేల కోట్లు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను కార్పోరేట్లకు పణంగా పెట్టేవి. అందువల్లే లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించి ఉద్యమం చేస్తున్నా కూడా చలనం లేకుండా కేంద్రం వ్యవహరించడం సరికాదు అన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టి దావానలంలా వ్యాపించింది.. ఇప్పుడు కేంద్రం మేలుకోకుంటే రైతు ఉద్యమంలో పడి కొట్టుకుపోతారు. మంచినీళ్లు దొరకని తెలంగాణలో భూగర్భజలాలు ఎగిసిపడే స్థితిని తీసుకొచ్చాము. నష్టమొచ్చినా రైతుకు లబ్ది చేకూరాలని తలంచి వంద శాతం పంటలు మద్దతు ధరకు కొన్నది ఒక్క తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకొచ్చారు. యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టంపై అంచనా వేసి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి పంపిస్తే నయాపైసా సాయం చేయలేదు అని అన్నారు.

Related posts