తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

అమిత్ షా కాదు జూటా షా: గంగుల

TRS Leader Gangula fire to BJP

మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఆయన అమిత్‌ షా కాదని జూఠా షా అని ఎద్దేవా చేశారు. గద్దెనెక్కేందుకు మేము అబద్దాలు చెప్పామని ఆ పార్టీ నేత గడ్కరీ ఇప్పటికే చెప్పారని తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర ఉన్న సంజయ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలకు దిగితే గుండు కొట్టిస్తానని హెచ్చరించారు.

నాది దొంగ వ్యాపారం అని భావిస్తే చేతనైతే ఆదాయ పన్ను శాఖ దాడులు చేయించుకోవాలని సవాల్‌ విసిరారు.1992 నుంచి మా కుటుంబానికి గ్రానైట్‌ వ్యాపారం ఉందని, ఇన్‌కం టాక్స్‌ కట్టి నిజాయతీగా సంపాదించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఒకటి తగ్గినా బీజేపీ నాయకులు అమిత్‌ షా కరీంనగర్‌ వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీ అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Related posts

నందమూరి హరికృష్ణ … ప్రమాదవశాత్తు మృతి…

chandra sekkhar

నేతలు దారితప్పుతున్నారా..?

admin

మద్యం మత్తులో పక్కింటి తలుపు కొట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి

jithu j

Leave a Comment