telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్రిపుల్ రైడ్ లో తెరాస మహిళానేత … వీడియో తీశాడని అధికారిపై చెప్పుతో దాడి..

TRS Release Lok Sabha Candidates List

ట్రాఫిక్ నిబంధనలు ప్రజల శ్రేయస్సుకోసం పెట్టినవే అయినప్పటికీ వారి నుండే సహకారం లేకపోవడం విశేషం. అయినప్పటికీ ప్రతివారినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ట్రాఫిక్ అధికారులు ఎంతో కష్టాన్ని ఓర్చి కృషిచేస్తుంటారు. కానీ వారికి అడుగడుగునా అవమానాలు తప్ప మరేమి మిగలటంలేదు. తాజాగా, ట్రిపుల్ రైడింగ్‌తో వెళ్తున్న బైక్‌‌ను వీడియో తీసిన కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ మహిళా నేత తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. హైదరాబాద్, జియాగూడకు చెందిన మహమ్మద్ గౌస్, మరో ఇద్దరితో కలిసి బైక్‌పై మౌలాలి కమాన్‌వైపు వెళ్తున్నాడు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ ఇది గుర్తించాడు. ట్రిపుల్ రైడింగ్ నేరం కావడంతో వీడియో తీశాడు.

కాసేపటికి మౌలాలి, షాదుల్లానగర్‌కు చెందిన టీఆర్ఎస్ మహిళా నేత, వార్డు సభ్యురాలు సయ్యద్ మహ్మద్ బేగం, ఆమె భర్త సయ్యద్‌ గఫార్, కుమారుడు సయ్యద్ సిద్దిఖ్ హుస్సేన్, బంధువు మహమ్మద్‌ మజీద్‌లతో కలిసి వచ్చిన గౌస్ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. టీఆర్ఎస్ నేత అయిన మహ్మద్ బేగం కానిస్టేబుల్‌ను ఎడమకాలి చెప్పుతో కొట్టింది. మరోసారి ఇలాంటి పనులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts