telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అప్పటివరకూ ‘గ్లోబరీనా’ గురించి తెలియదు: కేటీఆర్

KTR Counter pawan comments

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘గ్లోబరీనా’ సంస్థ గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన గ్లోబరీనా వ్యవహారంలో మీ పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై ఏమైనా మాట్లాడుతారా?’ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.ఇంటర్ ఫలితాల తర్వాత వివాదం చెలరేగినప్పుడే దాని పేరును తొలిసారి విన్నాను. అప్పటివరకూ దాని గురించి కూడా నాకు తెలియదు’ అని ట్వీట్ చేశారు.

‘కేటీఆర్.. మీకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేనప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడాన్ని మీరు విధిగా భావిస్తున్నారా? ప్రభుత్వం సాధించిన విజయాలకు కలెక్టర్లు తమ ట్వీట్ లలో మీమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు? మీరు రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారా అని అడిగారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘నేను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని. కాబట్టి ఆ అధికారంతోనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళుతున్నాని స్పష్టం చేశారు.

Related posts