telugu navyamedia
news political Telangana

ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం : కేటీఆర్‌

ktr trs president

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం అన్నారు. నా తల్లిదండ్రులు కూడా భూనిర్వాసితులే అన్నారు.

మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా త్వరలోనే సిరిసిల్లా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి అనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీర్ల పని తీరు భేష్‌ అని కేటీఆర్‌ ప్రశంసించారు. 

Related posts

పెద్దమ్మ గుడిలో వీహెచ్.. ప్రమాణానికి రాని కేటీఆర్!

vimala p

నేడు .. అంబేడ్కర్‌వాదుల మహాగర్జన సభ.. ఈసీ అనుమతి ఉందా..!

vimala p

చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు

vimala p