telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతుబంధు దేశానికే ఆదర్శం: హరీష్‌రావు

harish rao trs

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు బంధును ఆపడానికే నియంత్రిత వ్యవసాయ సాగు అని ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే, లాభసాటిగా ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సారి కోటీ నలబై వేల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.

నియంత్రణ వ్యవసాయ సాగును రైతుల చేత చేయించాలని అన్నారు. దీనికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కో ఆపరేటివ్ ఛైర్మన్లది కీలక పాత్ర ఉంటుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో 6.38 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని తెలిపారు. వానకాలంలో కాకుండా యాసంగిలో మొక్కజొన్న వేయాలని తెలిపారు. వానకాలంలో మాత్రం పంట మార్పిడి జరగాలన్నారు. ఎక్కువ సాగు చేసే పత్తికి నాణ్యమైన విత్తనాలను అందిస్తామని అన్నారు. సాగుకు ముందే ఫెర్టిలైజర్ తీసుకపోవాలని సూచించారు. ఫెర్టిలైజర్ అందరికీ అందేలా రైతు సమన్వయ సమితిలు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

Related posts