telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ పాలనకు రెండేళ్లు…

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది. అనతికాలంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదుగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఈ రంగంపై సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. రైతులకు పెద్దపీట వేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయరంగానికి అవసరమైన సాగునీటిని పుష్కలంగా అందించారు.

ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాను సస్యశ్యామలం చేస్తున్నారు. అలాగే రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించారు. అలాగే రైతుబంధు కింద పంట సాయం కూడా పెంచారు.

గతంలో ఎకరాకు రూ.8వేలు ఇస్తుండగా ప్రస్తుతంగా దానిని రూ.10వేలకు పెంచారు. ఇక వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు పెద్దఎత్తున పెన్షన్లు అందిస్తూ ఆయా కుంటుంబాలకు అండగా ఉంటున్నారు. వారికి పెద్దన్నగా చేయూతనిందిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్శిస్తూ..నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పేద కుటుంబాల్లో పెళ్ళికానుకగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరుతో ప్రభుత్వం లక్ష రూపాయలకు పైగా ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. ఇక వృద్ధులు, ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలకు, దివ్యాంగులకు భారీగా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 2018 డిసెంబర్ 13 నుంచి నేటి వరకు రెండేళ్ళ కాలంలోనే సిఎం కెసిఆర్ ప్రభుత్వం భారీ ఎ త్తున చేట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

పంటల కొనుగోలు కేంద్రాలు

రైతులు పండించిన పంటలకు తగు గిట్టుబాటుధర కల్పించడానికి పంటల కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసింది. -6408 కేంద్రాల ద్వారా రైతుల కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లను చేపట్టింది. గత ఆర్ధిక సంవత్సరం (201920-20)లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొదలుకుని ఈ ఆరేళ్లలో 367 శాతం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో దేశంలో 63శాతం తెలంగాణ వాటా కాగా, మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 37శాతం వాటాగా ఉంది. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మన తెలంగాణే. రైతులకు వడ్డీలేని రుణాల బకాయిలు రూ.256 కోట్లు (5 జులై 2019) చెల్లించింది.- నియంత్రిత పద్ధతిలో ప్రత్యామ్నాయ పంటల సాగు అమలు – చేసింది

ధరణి వెబ్ సైట్

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి (29 అక్టోబర్ 2020)లో సిఎం కెసిఆర్ ధరణి వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంచ్ భూమి లెక్కలు పక్కాగా నమోదు చేయాలన్న లక్షంతో దీనిని చేపట్టారు. ఇందులో భాగంగా తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించారు.-

పెన్షన్లు . సంక్షేమం

రాష్ట్రంలో ప్రస్తుతం 39 లక్షల 35 వేల మందికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోంది. వీటి కోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అలాగే బీడీ కార్మికులకు పిఎఫ్ కటాఫ్ డేట్ తొలగించింది. ఒక ఇంట్లో ఇంకెవరైనా పెన్షన్ పొందుతున్నా, మిగతా అర్హులకూ పెన్షన్‌ను అందిస్తోంది. అలాగే పేద కుటుంబాల్లో వివాహాలు భారంగా మారుతున్న నేపథ్యంలో ఆడకూతురుకు పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,00,116లను అందిస్తోంది. కాగా దివ్యాంగులకు సం క్షేమ పథకాలు, కాంట్రాక్టులు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం లో 5శాతం అదనపు రిజర్వేషన్‌ను కల్పిస్తోంది. కాగా దివ్యాం గ వధువులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం రూ.1.25 లక్షల మేర అందిస్తోంది. ఇక గీత కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా నీరా పాలసీని అమలు చేస్తోంది.

కరోనా సమయంలో ఉచితంగా రేషన్ బియ్యం

కరోనా సమయంలో ప్రతి వ్యక్తికీ నెలకు 12 కిలోల చొప్పున 4 నెలల పాటు పౌర సరఫరాల శాఖ నుంచి ఉచితంగా రేషన్ బియాన్ని ప్రభుత్వం పంపిణి చేసింది. అలాగే మూడు నెలలపాలు 2 కిలోల చొప్పున కందిపప్పు,
రేషన్ కార్డులు లేని వారికి 10 కిలోల చొప్పున 4 నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందజేసింది. అలాగే గత ఏప్రిల్, మే నెలల్లో ఒక్కో
కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం అందించింది.
-రేషన్ పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కల్పించింది. తెలంగాణ స్ఫూర్తితోనే కేంద్రం వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు ప్రవేశపెట్టింది.

పంచాయతీరాజ్ శాఖలో కీలక నిర్ణయాలు

పంచాయతీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు సిఎం కెసిఆర్ తీసుకున్నారు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం – (2018) పక్కాగా అమలు చేస్తోంది. అలాగే గ్రామ పంచాయతీలు (పాతవి 8,690+కొత్తవి 4,079) 12,769 ఉండగా,-కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టింది. ఇక పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 6 సెప్టెంబర్ 2019 నుంచి నెల పాటు నిర్వహించింది. ఇందు లో పారిశుద్ధానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అలాగే గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారంతో పాటు పురాతన భవనాల కూల్చివేత, శ్మశాన వాటికలు (వైకుంఠధామాలు), డంపింగ్ యా ర్డు లు, ప్రతి గ్రామానికో నర్స రీ, హరితహారం ప్రణాళికలు మొదలైన పనులు చేపట్టారు.

ఐటి

ఐటిని కేవలం హైదరాబాద్ వంటి నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరణపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఐటిలో మన రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. జాతీయ సగటును మించి రాష్ట్ర ఐటి ఎగుమతులు కొనసాగుతున్నాయి. 201819, 201920 రెండేళ్లలో 2.38 లక్షల కోట్ల ఐటి ఎగుమతులు జరిగాయి. కరోనా సమయంలో జాతీయ స్థాయిలో ఐటి వృద్ధిరేటు 8.09 శాతం ఉండగా, మన రాష్ట్రంలో 17 శాతం వృద్ధిరేటు నమోదైంది. -లుక్ ఈస్ట్ నినాదంతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర లాంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారఁభించాయి.

మరో రెండు జిల్లాలు

కొత్తగా రెండు జిల్లాలు (ములుగు, నారాయణపేట) ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మొత్తం 33కు చేరింది (10 పాతవి+23 కొత్తవి). అలాగే రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు (44 పాతవి+30 కొత్తవి) చేరింది. గ్రామ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.5 వేల లోపు నుంచి రూ.8500 వరకు పెంచగా, పంచాయతీ సిబ్బందికి ఎస్‌కె డే పేరిట రూ.2 లక్షల జీవిత బీమా (10 అక్టోబర్ 2019)కల్పిస్తోంది. పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ ఏర్పాటు 19 సెప్టెంబర్ 2019న ఏర్పాటు చేసింది.

కొత్త చట్టం. పెరిగిన మున్సిపాలిటీలు

రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం 19 జూలై 2019 అమలులోకి వచ్చింది. అప్పటి వరకు మున్సిపాలీటీలు, కార్పొరేషన్ కలిపి రాష్ట్రంలో 71 ఉండగ వాటి సంఖ్యను 128కు పెంచింది. పలు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా చేసింది. గతంలో ఆరు (జిహెచ్‌ఎంసి, గ్రేటర్ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం)ఉండగా వాటికి అదనంగా ఏడింటిని చేర్చడంతో రాష్ట్రంలో కార్పొరేషన్ల సంఖ్య మొత్తం 13కు పెరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన వాటిల్లో బడంగ్ పేట, బండ్లగూడ జాగీర్, మీర్ పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రగతి కార్యక్రమం (24 ఫిబ్రవరి 2020 నుంచి 10 రోజుల పాటు) స్వచ్ఛ కార్యక్రమాలు, గ్రీన్ ప్లాన్, నర్సరీలు, విద్యుత్ పనులు, శ్మశాన వాటికల నిర్మాణం, సమీకృత మార్కెట్లకు, డంపింగు యార్డులు, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలకు స్థలాల గుర్తింపు మొదలైన పనులు చేపట్టారు.

మిషన్ భగీరథ

ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్షంతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని 95 శాతానికిపైగా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తోంది.

గురుకులాలు

రాష్ట్రంలో బిసి గురుకులాలు మొత్తంగా 280కు పెరిగాయి. 119 నియోజకవర్గాల్లో కొత్తగా బిసి గురుకులాలు ప్రారంభం 17 జూన్ 2019 ప్రారంభమయ్యాయి. ఇందులో పాతవి 161 ఉండంగా, కొత్తవి 119ని చేపట్టారు. దీంతో వాటి సంఖ్య 280 వరకు పెరిగాయి. ( గురుకులాలు : తెలంగాణ ఏర్పాటుకు ముందు 298 ఉండగా, కొత్తగా 618 పాఠశాలలు, 53 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. దీంతో వీటి సంఖ్య 969 వరకు చేరింది. వీటిలో 3 లక్షల మంది చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థిపై 1.20 లక్షలు ఖర్చు చేస్తోంది.)

వరద బాధితులకు ఆర్ధిక సాయం

హైదరాబాద్‌లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 179అన్నపూర్ణ భోజనం సెంటర్ల ద్వారా రోజు కు 52వేల మందికి భోజన సౌకరం కల్పిస్తోంది. కరోనా సమయంలో వలస కూలీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేసింది.

జిహెచ్‌ఎంసి మేనిఫెస్టోలో వరాలు

– 2020 నుంచి ప్రతి ఇంటికీ, అపార్టు మెంట్లకు కూడా 20 వేల లీటర్ల దాకా ఉచితంగా మంచినీరు అందిస్తామని పేర్కొన్నది. అలాగే సెలూన్లకు, లాండ్రీలకు, దోభీఘాట్‌లకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామి ఇచ్చింది. 13 వేల కోట్లతో హైదరాబాద్ మహా నగరానికి సీవరేజి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే – గోదావరితో మూసీ అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. కరోనా కాలానికి మోటార్ వాహన పన్ను రద్దుతో పాటు – పరిశ్రమలు, వ్యాపార సంస్థల విద్యుత్ కనెక్షన్లకు కనీస విద్యుత్ డిమాండ్ చార్జీల మినహాయింపు నిచ్చింది.

నూతన సచివాలయానికి గత సంవత్సరం జూన్ 27వ తేదీన సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా 26 జిల్లా కలెక్టరేట్ల భవనాల నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు 104 క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. శాసనసభ్యుల నివాసం కోసం ‘న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్’ 17 జూన్ 2019న ప్రారంభించారు.

ఆరోగ్యం

రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బిబి నగర్‌లో- ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను 4 డిసెంబర్ 2019న ప్రారంభించారు. కోటిన్నర మందికి కంటివెలుగు పరీక్షలు నిర్వహించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు 6 లక్షల ప్రసవాలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా కెసిఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా వైద్య సౌకర్యాలను అందిస్తోంది. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సాధారణ కాన్పు (నార్మల్ డెలివరీలు) జరిగే విధంగా చర్యలు తీసుకుంది. ఈ చర్యలతో గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 30 శాతం డెలివరీలు – కాగా ప్రస్తుతం రెట్టింపయ్యాయి. అందుబాటులోకి ఐసియు సేవలు ( మెడికల్ కాలేజీల్లో కూడా)వచ్చాయి. 46 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దవాఖానాల్లోనే ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, వీటికోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తోంది. నగదు రహితంగా ఎంప్లాయీస్, జర్నలిస్టుల హెల్త్ స్కీం (ఈజీహెచ్‌ఎస్) అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకంలో 35శాతం వరకు సేవలు కూడా పెరిగాయి. వ్యాధుల పట్ల అవగాహణతో మరణాల శాతం కూడా తగ్గుముఖం పట్టింది. మృతదేహాల తరలింపునకు 50 పరమపద వాహనాల ఏర్పాటు చేసింది.

ఆర్‌టిసి ఉద్యోగులకు వరాలు

ఆర్‌టిసి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏండ్లకు పెంచింది. సమ్మె కాలంలో బకాయి పడ్డ
వేతనాలను కూడా చెల్లించింది
ప్రస్తుత (పెండింగ్)ఆలోచనలు
పెన్షన్ల వయో పరిమితి 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించే యోచనలో సిఎం కెసిఆర్ ఉన్నారు. నిరుద్యోగ యువతకు నెలవారీ నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ పార్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

రైతు సంక్షేమం

2019 వానాకాలం నుంచి రైతుబంధు పంట సాయం ఎకరాకు రూ. 8 వేల నుంచి 10 వేలకు పెంచారు. దీంతో 56 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరింది. దీని కోసం ప్రభుత్వం -ఏటా రూ. 12వేల కోట్ల ఖర్చు చేస్తోంది. అలాగే రైతు బీమా రూ.2271 నుంచి రూ.3,556 వరకు ప్రీమియం పెరిగినా పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీని కింద 32.73 లక్షల మంది రైతులకు ఏటా రూ.1164 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. అయితే వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా మరణించిన 31,654 వేల రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పైగా రూ.1582 కోట్ల రైతుబీమా సొమ్ము లభించింది. ఇక రైతులకు రెండో దఫా లక్ష లోపు రుణమాఫీ ప్రభుత్వం మాఫీ చేసింది. తొలివిడతగా రూ.25 వేల లోపు బాకీ ఉన్న 5.88 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసింది. రూ.1210 కోట్లును అందజేసింది. మొత్తం రుణాలు రూ. 25,936 కోట్లు కాగా, 40.66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులు తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను తెలుసుకోవడం కోసం, ఇతర అంశాలపై పరస్పరం చర్చించుకోవడం కోసం రాష్ట్రంలోని 2,604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణన్ని చేపట్టింది. – తొలి రైతు వేదికను సిఎం కెసిఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో గత అక్టోబర్ 31న ప్రారంభించిన విషయం తెలిసిందే.

సాగునీటితో సస్యశ్యామలం

కాళేశ్వరం ప్రాజెక్టును సిఎం కెసిఆర్ (21 జూన్ 2019) ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల సస్యశ్యామలమయ్యాయి. సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు అందుతోంది. నీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 80 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. ప్రాజెక్టుల ద్వారా 3,688 చెరువులను నింపారు. చెరువుల కింద 15 లక్షల ఎకరాలు సాగవుతున్నది. అలాగే రాష్ట్రంలో 3 మీటర్ల మేర భూగర్భ జలాలు (గతంలో 12 మీటర్ల లోతు – 9 మీటర్ల లోతులో నీరు) -కూడా పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు మొదటిసారిగా అందిన గోదావరి జలాలు -అందాయి. అలాగే 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ (2018 జనవరి 1 నుంచి)ను ప్రభుత్వం ఇస్తోంది. సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాటు- 24 గంటల ఉచిత కరెంటుతో రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటి 25 లక్షల ఎకరాల్లో పంట సాగు వస్తోంది. -ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలోనూ పాడి రైతుల రుణాల పరిమితి 1.6 లక్షల నుంచి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. 3 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించింది.

Related posts