• Home
  • వార్తలు
  • తెరాస అన్యాయం..రెబల్ గా పోటీ చేస్తా… : మాజీ ఎమ్మెల్యే కొవేటి సమ్మయ్య
రాజకీయ వార్తలు వార్తలు

తెరాస అన్యాయం..రెబల్ గా పోటీ చేస్తా… : మాజీ ఎమ్మెల్యే కొవేటి సమ్మయ్య

trs ex mla ready to compete as rebal

తెరాస లో రోజురోజుకు అసంతృప్తికి లోనవుతున్న నాయకులు ఎక్కువ అవుతున్నారు. దీనితో ఆ పార్టీ అధిష్టానం రోజుకో సమస్య తలెత్తుతుంది. తాజాగా తెరాస అధిష్టానం తనకు అన్యాయం చేసింది అంటూ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆరోపించారు. తాను తెరాస లో రెండు సార్లు గెలిచానని, ఒక సారి ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా కూడా చేశానని చెప్పారు. అయినా అధిష్టానం తనను చిన్న చూపే చూస్తుందని వాపోయారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారని బయటనుండి కొందరిని చేర్చుకోవాలన్న తీర్మానానికి కూడా తాను అంగీకరించన్నాయి సమ్మయ్య చెప్పారు.

తనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిసారి అధిష్టానానికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోతుందని సమ్మయ్య అన్నారు. ప్రస్తుతం కూడా సిర్పూర్ కాగజ్ నగర్ టికెట్ తనకు ఇవ్వాలని కోరినప్పటికీ బయట వ్యక్తి అయిన కోనేరు కోనప్పకు కేటాయించారని.. ఇలాంటి పనులు చేయటం అధిష్టానం తనకు చేస్తున్న ద్రోహం అని సమ్మయ్య అన్నారు. ఇది బీసీ లను అణగదొక్కే ప్రయత్నాలలో భాగమేనని వారు ఆరోపించారు. ఎన్నడూ తెరాస లో పనిచేయని వారు, ఉద్యమం కోసం జండా కూడా పట్టని వారు నేడు పార్టీలో ముఖ్యులుగా పరిగణించడం అధిష్టానం మానుకోవాలని సూచించారు. ఇప్పటికైనా అధిష్టానం తగిన నిర్ణయాలు తీసుకోని టికెట్ తనకే కేటాయించాలి, లేదంటే రెబల్ గా అయినా పోటీకి సిద్ధం అని సమ్మయ్య హెచ్చరించారు.

Related posts

ఉపద్రవం….

chandra sekkhar

రాజధానిలో డ్రగ్స్ మాఫియా

jithu j

టికెట్ల వివాదంతో క్రికెట్ మ్యాచ్ వేదిక మార్పు…!

nagaraj chanti

Leave a Comment