• Home
  • వార్తలు
  • అయోమయం సృష్టిస్తున్నారు..దానం పై విజయారెడ్డి విమర్శలు!
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

అయోమయం సృష్టిస్తున్నారు..దానం పై విజయారెడ్డి విమర్శలు!

ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ పై పీజీఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో మంత్రిగా పని చేసి కూడా ప్రజలకు ఏమీ చేయలేని వ్యక్తులు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరి, కార్యకర్తల్లో అమోమయం సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. ఖైరతాబాద్ టికెట్ విషయంలో కార్యకర్తలు అయోమయానికి గురయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు అలాంటివారిని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు.   ప్రజల్లో ఉండి పని చేసే వారికే టికెట్ ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారనిఆమె అన్నారు. కేసీఆర్ పై  తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. దమ్ముంటే ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని సవాల్ విసిరారు.

Related posts

తెలంగాణాలో కొత్త పంచాయతీరాజ్ చట్టం…

admin

సీఎం సహాయానిధిలోను అక్రమాలు

admin

భార్యాభర్తల సెక్స్ బహిర్గతం.. లక్షల సంపాదన.. తప్పుకాదు

nagaraj chanti

Leave a Comment