telugu navyamedia
news political Telangana

కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి

kcr special pooja in kaleswaram

తెలంగాణ పరిషత్  ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది.  అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్ జిల్లా చినముల్కనూర్ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పరాజయం తప్పలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాజేశం ఎంపీటీసీగా విజయం సాధించారు.

తెలంగాణలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 3,042 ఎంపీటీసీ స్థానాలు, 44 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1,101 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కాగా, తెలుగుదేశం పార్టీకి 20 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. బీజేపీ 184 ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకోగా, ఇతరులు 487 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు. 

Related posts

ఉమెన్స్ ఐపీఎల్ : దుబాయ్ కి పయనమైన మహిళలు…

Vasishta Reddy

తెలంగాణ సచివాలయంపై హైకోర్టులో పిటిషన్

vimala p

భార్యను చంపి 100 రోజులు ఫ్రీజర్లో…

vimala p