telugu navyamedia
సినిమా వార్తలు

“మా”లో మరో వివాదం… ఉపాధ్యక్ష పదవికి ఎస్వీ కృష్టారెడ్డి రాజీనామా

SV-Krishna-Reddy

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మార్చ్ 22న పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా నరేష్ కార్యదర్శిగా శ్రీమతి జీవితా రాజశేఖర్ ఎన్నికయ్యారు. “మా ” ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. శివాజీ రాజాపై నరేష్ విజయం సాధించాడు. అయితే నరేష్ ప్యానెల్ విజయం సాధించినప్పటికీ “మా”లో ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో గొడవలు తీవ్రతరమవుతున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు జరిగి, సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే గొడవలు మరింత ముదిరాయి. అసోసియేషన్ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో, అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్టారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించకపోయినా, అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగమే రాజీనామాకు కారణమని ఫిలింనగర్ టాక్. మరోవైపు, అసోసియేషన్ లో వివాదాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Related posts