telugu navyamedia
సినిమా వార్తలు

రకుల్ అందుకే ప్యాంట్ వేసుకోలేదంటూ… ఓ రేంజ్ లో ట్రోలింగ్

Trolling on Rakul Preeth Singh Pant
స్టార్ హీరోయిన్ రకుల్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. కారులో నుంచి రకుల్ దిగుతున్న ఫోటోను ఓ వ్యక్తి పోస్టు చేస్తూ “కారులో సెషన్ తరువాత ఆమె తన ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది” అని కామెంట్ చేశాడు. ఇది చూసిన రకుల్ “మీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్లు చాలానే చేసిందేమో… అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్ల వివరాల గురించి ఆమెనే అడుగు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతవరకూ మహిళలకు రక్షణ ఉండదేమో. కేవలం సమానత్వం, రక్షణ అని చర్చలు సాగిస్తే ఉపయోగం ఉండదు” అంటూ ఫైర్ అయ్యింది రకుల్. 
దీంతో నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?”, అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా ? అని నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు అంటూ రకుల్ ప్రీత్ పై నెటిజన్ల ట్రోలింగ్ చేస్తూ మండిపడుతున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ పైడ్ స్పందించిన రకుల్ “నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి కుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా” అని వ్యాఖ్యానించింది. అంటూ వివరణ ఇచ్చింది. అయినా కూడా నెటిజన్లు శాంతించడం లేదు. 

Related posts