telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్ పై ట్రోలింగ్ 

prabhas
“బాహుబలి” చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో” చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకవైపు సాహో షూటింగ్, మరోవైపు రాధాకృష్ణ సినిమా షూటింగులో పాల్గొంటూ చాల బిజీగా గా ఉన్నాడు ప్రభాస్. సాధారణంగా ప్రభాస్ లుక్స్ విషయంలో అస్సలు ప్రయోగాలజోలికి వెళ్ళడు. కానీ డైరెక్టర్ రాధాకృష్ణ సినిమా కోసం ఓ కొత్త లుక్ ను ట్రై చేశాడు. ఇటీవల తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఆ సమయంలోనే ప్రభాస్ న్యూ లుక్ బయటకు వచ్చింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ కొత్త లుక్ ప్రభాస్ కు బాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

Related posts