telugu navyamedia
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ పై ట్రోలింగ్

janhvi-kapoor

ఇప్పుడు ట్రోలింగ్ అనేది సాధారణమైపోయింది. సెలెబ్రిటీల విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. ఇంతకుముందు చాలామంది సెలెబ్రిటీలు ట్రోలింగ్ ను ఎదుర్కొన్నారు. తాజాగా జాన్వీ కపూర్ నెటిజన్ల ట్రోలింగ్ కు బలైంది. ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లతో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది జాన్వీ. తాజాగా ఆమె కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ ఉండే డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా క్యూట్ గా ఉంది… కానీ ఆ హోలోగ్రఫిక్ డిజైన్ కాపీ అంటూ కొందరు ఫ్యాషన్ ప్రియులు జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ గా పాపులర్ అయిన బాల్మెయిన్ ఫాల్ 2018 కలెక్షన్ లో ఓ మోడల్ వేసుకున్న హోలోగ్రఫిక్ ఎఫెక్ట్ డ్రెస్ ని జాన్వీ కాపీ చేసిందంటూ ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంపై జాన్వీ ఎలా స్పందిస్తుందో… గతంలో చాలా సార్లు తన బట్టల విషయంలో ట్రోలింగ్ బారిన పడింది జాన్వీ.

Related posts