telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ గారు, రానా ఎంతో రిస్క్ చేసి పని చేశారు..- త్రివిక్రమ్

ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ , రానా ద‌గ్గుపాటి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి విడుదలైన “భీమ్లా నాయక్” ఎఫెక్ట్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది భీమ్లా నాయక్‌ చిత్రం.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో తాజాగా “భీమ్లా నాయక్” సినిమా టీం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, తమన్, దర్శకుడు సాగర్ కే చంద్ర, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సంయుక్త మీనన్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

pawan rana bheemla nayak

ఈ కార్యక్రమంలోమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ముందుగా మీడియాకు థ్యాంక్స్‌. నేను ఈ సినిమా తీస్తే.. మీడియా దాన్ని భుజాల మీద వేసుకుని జనాల వద్దకు తీసుకువెళ్లింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనం.

ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు పెద్ద హర్డిల్ ఒరిజినల్ వెర్షన్ నుంచి దూరంగా జరిగి కొత్తగా చూపించే ప్రయత్నం చేశామ‌ని, మంచి కథ ఎప్పుడు ధ్రుతరాష్ట్దుని కౌగిలిలా అంటి పెట్టుకొని ఉంటుంది దాని మీద ప్రేమను చంపుకోవాలి అప్పుడే మనం అనుకున్నది వస్తుంది అని అన్నారు.

పవన్ కళ్యాణ్ గారు రానా కరోనా టైం లో కూడా ఎంతో రిస్క్ చేసి ప్యాషన్‌తో పని చేశారు. తమన్ నా ఫ్యామిలీ. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం గ్రేట్.. తమన్ టైం స్టార్ట్ అయ్యింది’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇందులో పని చేసిన అందరూ ఈ సినిమాని ప్రేమించి పని చేశారు. డైరెక్టర్ సాగర్ బాగా హ్యాండిల్ చేశాడు.

మ‌రోవైపు..1980, 90లలో కాలం నాటి నటీనటులతో పోల్చితే ఇండియన్‌ న్యూ జనరేషన్‌ నటీనటులు ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తులు అని అర్థమవుతోంది. ఈ స్టేట్‌మెంట్‌తో ఎవరైనా బాధపడితే క్షమించమని కోరారు .

కానీ ఈ తరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. గణేశ్‌ మాస్టర్‌ స్టెప్పులు బాగా కంపోజ్‌ చేశారు. సుమారు 600 మందితో సాంగ్‌ షూట్‌ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్‌ షూట్‌ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి వెళ్లగానే అక్కడ అంతమంది జనాన్ని చూసి నేను పారిపోయా. ఆయన మూడు రోజుల్లోనే సాంగ్‌ చేశారు..

“సాగర్‌..ఈ కథను ఎంతగానో అర్థం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఆయన వెంటే మేమున్నాం. ఆయనకు వచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో పాట పాడించాం. ఆతర్వాత ఆయనకు పద్మశ్రీ రావడం.. మకెంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని అన్నారు

Related posts