telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ రీమేక్

Pawan

పవన్ కల్యాణ్ రాజకీయాల కారణంగా వెండితెరకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం రాజకీయపరంగా అంత బిజీ కాకపోవడంతో పవన్ మళ్లీ సినిమాలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అభిమానులు, సన్నిహితులు పవన్ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారట. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కోరిక మేరకు పవన్ ఓ రీమేక్‌లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా `పింక్` ఇటీవల తమిళంలోకి అజిత్ హీరోగా రీమేక్ అయ్యి అక్కడా విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులు ప్రస్తుతం దిల్ రాజు వద్ద ఉన్నాయి. తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు, త్రివిక్రమ్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని కూడా సమాచారం. పవన్‌ను ఇటీవల త్రివిక్రమ్ కలిసి ఈ సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ ఇంకా తన నిర్ణయం తెలియజేయలేదట. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాబోయే రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఆయన కోసం హరీష్ శంకర్ కథ సిద్ధం చేయబోతున్నాడని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందని వార్తలు వచ్చాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో హరీష్ రూపొందించిన “గబ్బర్‌సింగ్” ద్వారానే పవన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

Related posts