telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంకా అతన్ని కలవలేదు… పెళ్లిపై త్రిష స్పందన

Trisha

చెన్నై చిన్నది త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా కెరీర్‌పైనే దృష్టి సారించింది. 37 సంవత్సరాల త్రిష పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష‌కు నిశ్ఛితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది. అలాగే టాలీవుడ్ హీరో రానాతో త్రిష డేటింగ్ అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన త్రిష ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పెళ్లి గురించి మాట్లాడింది. “మీ జీవిత భాగస్వామిని కనుగొన్నారా?” అని ఓ వ్యక్తి త్రిషను ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ… “నేను ఇంకా అతణ్ని కలవలేదు” అని త్రిష సమాధానం ఇచ్చింది. ఇక ఇరవై ఏళ్లుగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది

Related posts