telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘బద్లా’ తెలుగు రీమేక్ లో .. త్రిషా.. !

trisha as tapsi in telugu badla movie

ఏ భాషలో అయినా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలను ఇతర బాషలలో రీమేక్ చేసేయడం మాములే. ఇటీవల ఈ పద్దతి పెరిగినట్టే కనిపిస్తుంది. తాజాగా, అమితాబ్ .. తాప్సీ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘బద్లా’ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాత ధనుంజయ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

తన ప్రమేయం లేకుండానే ఒక హత్య కేసులో చిక్కుకున్న తాప్సీని కాపాడటానికి లా వృత్తిలో ఉన్న అమితాబ్ రంగంలోకి దిగుతాడు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇటీవల ’96’ హిట్ తో త్రిష క్రేజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నారని చెబుతున్నారు. త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related posts