telugu navyamedia
సినిమా వార్తలు

వైజాగ్ ఆసుపత్రిలో వెంకటేష్…!?

Shriya-and-venkatesh
టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ఉంది. సీనియర్ హీరో అయినప్పటికీ తనకు తగ్గ కథలను ఎంచుకుంటూ ఇప్పటితరం హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు వెంకటేష్. సంవత్సరానికో వైవిధ్యమైన చిత్రంలో నటిస్తూ వరుసగా హిట్లు కొడుతున్నాడు వెంకీ. దృశ్యం, గురు… ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని నటించిన ఎఫ్-2 చిత్రం సాధించిన బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇక త్వరలోనే నాగచైతన్యతో కలిసి “వెంకీ మామ” సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు వెంకీ. సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోగానే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తనకున్న బ్యాక్ పెయిన్ ను తగ్గించుకోవడం కోసం వెంకీ  వైజాగ్ లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. ఈ ఆసుపత్రిలోనే వారం రోజుల ట్రీట్మెంట్ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు వెంకీ. “వెంకీ మామ” తరువాత మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

Related posts