telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి : ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు

ముందుగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, అందులోని సిబ్బంది ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చే విధంగా సహకరిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ ట్రస్మా తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు. కోవిడ్ సెలవుల కారణంగా పాఠశాలలు మూసి ఉంచడం వలన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ప్రకటించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రెండు వేల రూపాయల నగదు మరియు 25 కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయంగా ఒక లక్షా ఇరవై అయిదు వేల మంది సిబ్బందికి అందజేసినoదుకు మా TRSMA కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ గారికి , విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రావు గారికి , రాష్ట్ర మరియు జిల్లా,మండల విద్యాశాఖ అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు అందరికీ ప్రత్యేక వందనములు తెలియజేశారు. ఇంకనూ సుమారు లక్ష వరకు ఉన్న బోధన మరియు బోధనేతర సిబ్బంది కి ప్రభుత్వ సహాయ ఫలాలు ఇంకా అందలేదని వారు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు. ఈరోజు ఉదయం శ్రీనగర్ కాలనీ లోని గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారి స్వగృహంలో TRSMA తరఫున కలిసి ఇంకనూ సహాయం అందవలసిన నాన్ టీచింగ్ సిబ్బంది మరియు ఇతర టీచింగ్ సిబ్బందికి వెంటనే ప్రభుత్వ సహాయాన్ని మంజూరు చేయాలనే విషయమై వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలియజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గౌరవ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అతి త్వరలో ఈ సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన అన్నారు.

ఈ విషయమై 4 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలియజేశారని, కనుక ప్రైవేటు విద్యా సిబ్బంది ఎవరు ఆందోళన చెందవద్దని, నిశ్చింతగా ఉండాలి అని, అతి త్వరలో వారి సమస్య పరిష్కారం అయ్యేటట్లుగా చూస్తామని సబితా మేడం గారి హామీ మేరక, సంఘం తరఫున హామీ ఇస్తూ అందరికీ సహాయం అందే అంతవరకు రాష్ట్ర సంఘం అండగా నిలుస్తుందని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరప్ప , మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts