telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

6, 7, 8 తరగతులను వెంటనే ప్రారంభించాలి.. 

 రాష్ట్రంలో  6, 7 , 8 తరగతులను వెంటనే ప్రారంభించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  గారిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు గురువారం  తెలియజేశారు. 

కరోనా సెలవుల అనంతరం ఫిబ్రవరి ఒకటో తారీకు నాడు కేవలం 9 మరియు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే తరగతుల నిర్వహణకు అనుమతించారని, నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని, పాఠశాల సిబ్బంది గాని కరోనా బారిన పడిన ఉదంతం ఒక్కటి కూడా లేదని, ఇందుకు విద్యా సంస్థలలో యాజమాన్యాలు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు మరియు శానిటేషన్ ప్రక్రియ ఒక నిదర్శనమని ఆయన అన్నారు. 

ప్రైవేట్ విద్యా సంస్థల్లో అవసరమైన తరగతి గదులు సిద్ధంగా ఉన్నాయని, మరింతగా కరోనా నివారణకు అవసరమైన అన్ని శానిటేషన్ చర్యలు తీసుకోవడానికి యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని అంతేకాదు అవసరమైన పక్షంలో షిఫ్ట్ పద్ధతిలో పని చేయటానికి కూడా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ మద్దతు తెలియజేశాయని అని ఆయన మంత్రికి వివరించారు. కనుక పై విషయాలను దృష్టిలో ఉంచుకొని కనీసం ఫిబ్రవరి మూడో వారం నుంచి 6 నుండి 8 తరగతుల పునః ప్రారంభానికి చర్యలు తీసుకొని ఆదేశాలు జారీ చేయవలసిందిగా విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేశామని ఆమె సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని యాదగిరి శేఖర్ రావు అన్నారు. 

ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు ,ట్రస్మా ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్, రాష్ట్ర కోశాధికారి ఐవి రమణారావు,

సలహాదారులు డాక్టర్ ఇ ప్రసాద్ రావు గారు, డాక్టర్ జెఎస్ పరంజ్యోతిగారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గారు , మేడ్చల్ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి గారు, హైదరాబాద్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, మేడ్చల్ మరియు హైదరాబాద్ సభ్యులు,వివిధ టౌన్ ప్రెసిడెంట్ లు హాజరయ్యారు.

Related posts