telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ : .. చలానాల మోతపై .. ఒక్కరోజు సమ్మె.. కోట్ల నష్టం..

transport strike in delhi 23crores lost

24 గంటలు పాటు రద్దీగా కనిపించే దేశ రాజధాని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలేవీ రోడ్డెక్కలేదు. దేశం నలుమూలల నుంచి న్యూఢిల్లీకి చేరుకునే వందలాది లారీలు, ట్రక్కులు, క్యాబ్ లు, ట్యాక్సీలు.. చివరికి ఆటోలు మెరుపు సమ్మెకు దిగడమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన వాహన చట్టాన్ని నిరసిస్తూ రవాణా సంఘాల సమాఖ్య (యుఎఫ్టీఏ) ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేటు వాహన సంస్థలు సమ్మెకు దిగాయి. ఫలితంగా- న్యూఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.చలాన్ల మోతను మోగిస్తున్నారని, ఒక్కో ట్రక్కుకు లక్ష రూపాయలకు పైగా చలాన్లను విధించిన సందర్భాలు ఉన్నాయని రవాణా సంఘాల సమాఖ్య ఛైర్మన్ హరీష్ సబర్వాల్ ఆరోపించారు. తమకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సమ్మెకు దిగేలా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు తమను ప్రేరేపించాయని విమర్శించారు. దేశ రాజధాని ప్రాంతంలో ఒకరోజు వాహనాల రాకపోకల సమ్మె ఫలితం వల్ల సంభవించే నష్టమేంటో ప్రభుత్వానికి తెలుసునని ఆయన అన్నారు.

తమ నిరసనను తెలియజేయటానికి ఈ సమ్మె ఒక శాంపిల్ మాత్రమేనని హరీష్ సబర్వాల్ అన్నారు. చలాన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దారిస్తామని అన్నారు. యూఎఫ్టీఎ.. దేశంలోనే అతి పెద్ద రవాణా సంఘాలతో కూడిన సమాఖ్య. ట్రక్కులు, ప్రైవేటు బస్సులు, లారీలు, మ్యాక్సీ క్యాబ్ లు, ఆటోలు.. ఇలా 41 వాహనా సంఘాలకు ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. దేశ రాజధానిలో సుమారు 80 శాతం మేర వాహన సంఘాలతో కూడిన యూఎఫ్టీఏ సమ్మెకు పిలుపునిచ్చిన ప్రభావం.. దేశ రాజధానిలో వాహనాల రాకపోకలపై తీవ్రంగా పడింది. రవాణా సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన ఈ ఒక్కరోజు సమ్మె వల్ల కనీసం 23 వేల కోట్ల రూపాయల మేర క్రయ, విక్రయాలు స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు బస్సులు, ఆటో రిక్షాలు, యాప్, ఆన్ లైన్ ఆధారిత క్యాబ్ లు, ట్యాక్సీలు, వివిధ పాఠశాలు, కళాశాలల వాహనాలన్నీ సమ్మెలో పాల్గొనడం చారిత్రాత్మకమని చెబుతున్నారు.

Related posts