telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

హిజ్రాలతో కరోనా వైరస్… పోలీసులకు ఫిర్యాదు

hijra

కరోనారకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. హైదరాబాద్‌లో మరో కొత్త ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్‌ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. హైదరాబాద్‌‌లో పలు మెట్రో పిల్లర్లపైన దీనికి సంబంధించి పోస్టర్లు వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్‌ 100 కు ఫోన్‌ చేయండి’ అని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పోస్టర్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భాగ్యనగరంలో కలకలం రేగింది. దీనిపై హిజ్రాలు స్పందించారు. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, ఫేక్‌ న్యూస్‌, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్‌జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కరోనాకు సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేయోద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Related posts