telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఆర్బీఐ శుభవార్త… ఇకపై 24 గంటలూ నెఫ్ట్

RBI

తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు ఏ సమయంలో అయినా సరే బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇకపై సోమవారం నుంచి నెఫ్ట్ సేవలు 24 గంటలూ, 365 రోజులూ నిరంతరాయంగా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే నెఫ్ట్ నుంచి నగదు బదిలి అవకాశం ఉండేది. దీనితో వినియోగదారులు ఎక్కువగా గూగుల్, ఫోన్ పే మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు… సమయపరిమితి విధానంకి గుడ్ బై చెప్పింది. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో సైతం ఇక నెఫ్ట్ చేసుకునే సదుపాయం కల్పించింది.

Related posts