telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ట్రైనీ ఐఏఎస్ బూట్లకు బురద… అటెండర్ తో తుడిపించుకుంటూ ఇలా…!

Collector

ట్రైనీ ఐఏఎస్ అంకిత్ వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కాల్వల గ్రామంలో పర్యటించిన ఆయన… విధి నిర్వహణలో భాగంగా పొలాల్లోకి వెళ్లారు. ఇటీవల కురుస్తోన్న వర్షాలకు పొలాలు బురదగా మారడంతో ఆయన వేసుకున్న బూట్లకు బురద అంటుకుంది. దీంతో అంటెండర్ చెట్టు కొమ్మను విరిచి ఆయన బూట్లకు అంటుకున్న బురదను తొలగించారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీంతో ట్రైనీ కలెక్టర్‌పై జనం మండిపడుతున్నారు. శిక్షణలో ఉండగానే కింది స్థాయి ఉద్యోగులతో ఇలా వ్యవహరిస్తే.. ఉద్యోగంలో చేరితే ఇంకెలా వ్యవహరిస్తారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోటి ఉద్యోగితో ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అసలు వానాకాలంలో పొలాల్లోకి బూట్లు వేసుకొని వెళ్లడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎంతో కష్టపడి, సివిల్స్ రాసిన ఆయన.. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కున్నారనే భావన కూడా వ్యక్తం అవుతోంది.

Related posts