telugu navyamedia
culture news Telangana

రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ లో ఆంక్షలు..

high penalties on jumping traffic

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఎన్టీఆర్‌మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వెళ్లే వాహనదారులు ఆంక్షల సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అందుకు ఆయా రూట్లలో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు వివరించారు.

బేగంపేట్‌ రూట్‌ ఫ్లై ఓవర్లు మినహా నగరంలోని మిగతావన్నీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. 1వ తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదన్నారు.డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటునామని తెలిపారు. వీటిని అడ్డుకోవడం కోసం ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

Related posts

తెలుగు కోసం డబ్బు తెచ్చి ఇంగ్లీష్ కోసం ఖర్చు చేస్తారా?

vimala p

సూర్యగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించిన ప్రజలు

vimala p

పిల్లల ఆటలో … గెలుపోటములే చూస్తున్న .. నిర్లిప్త పోటీప్రపంచం.. వీళ్ళు మారరు..

vimala p